హైదరాబాద్ కు చెందిన మహిళ.. వ్యాపారవేత్త అయిన తన భర్తను రూ.8 కోట్లు డిమాండ్ చేసింది. కాదన్న అతణ్ని ప్రియుడి(Lover)తో కలిసి దారుణంగా హత్య చేసి 800 కి.మీ. దూరంలో కర్ణాటక కాఫీ తోటలో మృతదేహాన్ని(Dead Body) దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు. 3 వారాల క్రితం గుర్తించిన డెడ్ బాడీ ఆధారంగా 500 సీసీ కెమెరాల్ని పరిశీలించి ఆమెతోపాటు ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఉప్పల్ కు చెందిన 54 ఏళ్ల బిజినెస్ మెన్ రమేశ్ అదృశ్యమవగా… భర్త కనిపించడం లేదంటూ ఆయన భార్య నిహారిక కంప్లయింట్ ఇచ్చింది.
ఈ నెల 8న కొడగు జిల్లా సుంటికొప్ప వద్ద కాఫీ తోటలో కాలిన మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి పేరుతో ఉన్న మెర్సిడెజ్ బెంజ్ కారు CCఫుటేజీలో కనిపించింది. అర్థరాత్రి 12 నుంచి 2 గంటల మధ్య కారు విజువల్స్ క్లియర్ గా లేకపోవడంతో.. తుమకూరు వరకు 500 CC కెమెరాల్ని జల్లెడ పట్టారు. ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నిహారికతోపాటు వెటర్నరీ డాక్టర్ అయిన ఆమె ప్రియుడు నిఖిల్ తోపాటు అంకుర్ ను అరెస్ట్ చేశారు.
నిహారికకు 16 ఏళ్లున్నప్పుడే తండ్రి మరణిస్తే తల్లి ఇంకో పెళ్లి చేసుకుంది. ఇంజినీరింగ్ తర్వాత జాబ్ లో చేరి పెళ్లి చేసుకుని తల్లయిన నిహారిక.. భర్తతో విడిపోయింది. హరియాణాలో జాబ్ చేస్తుండగా మోసానికి పాల్పడి జైలుకెళ్లింది. అక్కడే ఆమెకు అంకుర్ పరిచయం కాగా.. జైలు నుంచి బయటకొచ్చాక రమేశ్ ను పెళ్లాడింది. విలాసవంతమైన జీవితం గడుపుతున్న టైంలోనే భర్తను రూ.8 కోట్లు అడిగింది. ఒప్పుకోని రమేశ్ ను నిఖిల్, అంకుర్ తో కలిసి అక్టోబరు 1న ఉప్పల్లోనే గొంతు కోసి హత్య చేశారు. డబ్బంతా తీసుకుని కారులోనే కర్ణాటక వెళ్లి మృతదేహాన్ని దహనం చేసినట్లు కొడగు పోలీస్ చీఫ్ రామరాజన్ తెలిపారు.