కట్టుకున్నదాన్ని కలకాలం కంటికి రెప్పలా కాపాడుకుంటానని బాస చేసిన ఆ కర్కశ భర్త… చేయి పట్టుకుని నడిచిన ఇల్లాలినే చివరకు దయనీయంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ దారుణాతి దారుణ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. స్టేషన్ ఘన్పూర్ మండలం రంగరాయిగూడెం సమీపంలోని కాశంనగర్ కు చెందిన వ్యక్తి.. తన భార్యను అంతమొందించేందుకు కరెంట్ షాక్ పెట్టాడు. తర్వాత అదే వైరుతో మెడకు ఉరి బిగించి హత్య చేశాడు.
భార్యను పొట్టనబెట్టుకుని పారిపోతున్న ఆ భర్తను గ్రామస్థులు పట్టుకున్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారమిచ్చి నిందితుడిని వారికి అప్పగించారు.