అధికారుల అక్రమ దాహార్తికి అడ్డు ఉండటం లేదు. తాజాగా మరో మహిళా అధికారి భారీగా డిమాండ్ చేసి ACB వలకు చిక్కారు. హైదరాబాద్ నార్సింగి(Narsingi) పురపాలిక టౌన్ ప్లానింగ్ అధికారి(TPO) మణిహారిక దొరికిపోయారు. ప్లాట్ క్రమబద్ధీకరణకు గాను LRS ప్రొసీడింగ్ ల జారీతోపాటు ప్రాసెస్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారు. రూ.10 లక్షలు డిమాండ్ చేసి అందులో రూ.4 లక్షలు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ ప్రకటించింది. గత కొన్ని నెలల్లోనే ఇది పెద్ద లంచం కేసు.