తండ్రికూతురు బంధాన్ని అపహాస్యం చేసేలా తన యూట్యూబ్(Youtube) ఛానల్లో కామెంట్స్ పెట్టిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అతణ్ని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ నిర్వహించిన ఆన్లైన్ చర్చలో ఆయన ఫ్రెండ్స్ తోపాటు పలువురు కామెంట్లు పెట్టారు.
పోక్సో సహా…
ప్రణీత్ పై పోక్సో సహా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అనంతరం బెంగళూరు కోర్టులో హాజరుపర్చారు. పరారీ(Abscond)లో ఉన్న మిగతా వారి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.
సీఎం ఆర్డర్స్…
హనుమంతు అసభ్యకర యూట్యూబ్ వీడియోపై సినీ నటుడు సాయిధరమ్ తేజ్ ఆవేదన చెందుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన CM.. ఇలాంటి వ్యక్తుల్ని అరెస్టు చేయాలంటూ ఆదేశించడంతో సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు.