
ఒక్క పాకిస్థానే కాదు.. అమెరికా ఎవ్వర్నీ నమ్మదు. కానీ షహబాజ్ సర్కారుకు ఈ మధ్య దగ్గరైనట్లు నటిస్తోంది. వ్యూహాత్మక ప్రయోజనాలు, భద్రత కారణాల వల్లే అమెరికాకు ఆ దేశం కీలకమైంది. సైనిక సంబంధాలు, ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహాయానికి తోడు అణ్వాయుధాలు గల దేశంగా నియంత్రణలో పెట్టుకుంది. ఈ యుద్ధాన్ని తన మధ్యవర్తిత్వంతో షహబాజ్ షరీఫ్ సర్కారు ఆపిందంటున్నా.. అసలు ఇరాన్ పై దాడికి పాకిస్థానూ ఓ కారణమే.
అఫ్గాన్, చైనా, ఇరాన్ తో పాక్ కు సరిహద్దులున్నాయి. ఈ ప్రాంతంలో ఆధిపత్యం కొనసాగాలంటే స్థావరం అవసరం. మిగతా దేశాలేవీ అమెరికా చెప్పుచేతల్లో ఉండవు కాబట్టి దాని ఏకైక దారి పాకిస్థానే. సోవియన్ యూనియన్(రష్యా), తాలిబన్లతో యుద్ధాలు.. ఆయుధాల రవాణా, సైనిక సరఫరాలకు పాక్ నే వాడుకుంది. గల్ఫ్ కన్నా పాక్ తోనే ఇరాన్ కు సరిహద్దు ఉండగా, అక్కణ్నుంచే ఎంతోకాలంగా నిఘా పెట్టింది. అందుకే ఈ యుద్ధానికి పాక్ కూడా కారణమే.
పాకిస్థాన్ అణ్వాయుధాలు కలిగిన దేశం. ఎక్కడో ఉండి దాన్ని నియంత్రించేకంటే దాని గడ్డపైనే ఉండి కంట్రోల్ చేస్తోంది. మొన్న భారత్ దాడి చేసినపుడు అణు కేంద్రాలకు దెబ్బ పడుతుందన్న భయంతోనే అమెరికా ఎంటరైంది. చైనాతో పాక్ సంబంధాలు బాగా పెరుగుతున్న దశలో అటువైపు వెళ్లకుండా తన అదుపులో ఉంచుకోవడానికే పాక్ ను నమ్మినట్లు నటిస్తోంది. లేదంటే ఆర్మీ చీఫ్ మునీర్ లాంటి వ్యక్తిని వాషింగ్టన్ ఆహ్వానిస్తారా.!