
అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసాలతో ఫ్రాన్స్ అగ్నిగుండంలా తయారైంది. రాజధాని పారిస్ తోపాటు లియాన్, మార్సెయిల్ నగరాలు… దహనాలు, దౌర్జన్యాలతో రావణకాష్ఠాన్ని రాజేస్తున్నాయి. వీధుల్లోకి వచ్చి నిరసనకారులు సృష్టిస్తున్న విధ్వంసంలో షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, బ్యాంకు సర్వీస్ సెంటర్స్ దగ్ధమయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,800 మందిని అరెస్టు చేశారు. చెకింగ్స్ చేస్తున్న సమయంలో అక్కడి పోలీసులు… మైనార్టీ వర్గానికి చెందిన 17 ఏళ్ల నహేల్ అనే వ్యక్తిని మంగళవారం కాల్చి చంపారు. ఈ ఘటన జరిగిన నాంటెర్రి ఏరియాలో మొదలైన ఆందోళనలు 3 మెయిన్ సిటీలకు విస్తరించాయి.
నిరసనకారులు గుంపులుగా వచ్చి దుకాణాలను లూటీ చేస్తూ వాటికి నిప్పు పెడుతున్నారు. గన్స్ ను ఎత్తుకెళ్తూ భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. సుమారు 50 వేల మందితో సెక్యూరిటీ అమలు చేస్తున్నా సిట్యుయేషన్ అదుపులోకి రావడం లేదు. ఈ ఆందోళనలో యువకులే ఎక్కువగా పాల్గొంటున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.
మరోవైపు అల్లర్లు స్ప్రెడ్ అవుతుండటానికి ప్రధాన కారణం సోషల్ మీడియానేనని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్ మేక్రాన్ అన్నారు. పారిస్ శివారులో మేయర్ విన్సెంట్ జీన్ బ్రూ ఇంటికి నిప్పంటించిన దుండగులు… కారుతో ఢీకొట్టారు. ఈ దాడిలో మేయర్ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఫ్రాన్స్ లో వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగనుండటంతో అక్కడి హింసపై ఒలింపిక్ మేనేజ్ మెంట్ కమిటీ… పరిస్థితుల్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ప్రెసిడెంట్ మేక్రాన్ సైతం జర్మనీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా… దేశంలోని ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ టూర్ ను వాయిదా వేసుకున్నారు.