
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు రూ.12 లక్షల కోట్ల విలువైన స్కామ్ లకు పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో అవినీతి నిర్మూలనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బలమైన పునాది వేసిందన్నారు. కాంగ్రెస్ తోపాటు నేషనల్ కాన్ఫరెన్స్(NC), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(PDP)లపైనా షా ఫైర్ అయ్యారు. టెర్రరిజం వల్ల జమ్మూకశ్మీర్ లో 42 వేల మంది మరణించారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని జమ్ములో జరిగిన ప్రోగ్రాంలో ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370లోని నిబంధనల్ని 2019లో రద్దు చేసిన తర్వాత కొత్త జమ్మూకశ్మీర్ నిర్మాణం జరుగుతోందని.. రాళ్లదాడులు, ఉగ్రవాద చర్యలు 70 శాతం తగ్గాయని అమిత్ షా తెలిపారు.
