దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎమర్జెన్సీ వార్డులో మంటలు రావడంతో రోగులు, వైద్య సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఆరు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఎండోస్కోపీ రూమ్ నుంచి మంటలు వచ్చినట్లుగా భావిస్తున్నారు. AIIMS ప్రాంగణానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు.. అందులో ఉన్నవారందర్నీ బయటకు పంపించివేశాయి.