ఉత్తరాదిలో కురుస్తున్న వర్షాలు ప్రజా జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నాయి. ఇప్పటికే దిల్లీలోని ఎర్రకోట సహా చారిత్రక కట్టడాలన్నీ నీటిలో చిక్కుకోగా ఇప్పుడు తాజ్ మహల్ ని సైతం వర్షపు నీరు తాకింది. యమునా నదిలో ఫ్లడ్(flood) బాగా పెరగడంతో గత 45 ఏళ్ల చరిత్రలో తొలిసారి తాజ్ మహల్ గోడల్ని నీరు చుట్టుముట్టింది. ఆగ్రా తీరంలో యమునా(Yamuna) నది వాటర్ లెవెల్(level) 495 అడుగుల గరిష్ఠ నీటిమట్టానికి గాను 497.9 అడుగుల లెవెల్ కు చేరుకుంది. దసరా ఘాట్ వరకు నీరు చేరుకుంది. భారీగా వరద చేరుకుంటుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తాజ్ మహల్ లోని ఇత్తీమద్-ఉద్-దౌలా సమాధి వరకు వాటర్ నిండిపోయింది.
మరిన్ని చారిత్రక కట్టడాలైన రామ్ భాగ్, మెహ్తాబ్ భాగ్, జోహ్రా భాగ్, కాలా గుంబద్, చీనీ కా రౌజా వరకు వరద నీరు చేరుకుంది. అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని, పురాతన కట్టడాలకు ఎలాంటి ముప్పు లేదని అర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ASI) తెలిపింది.