
గుజరాత్ హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం(supreme court) విచారణకు స్వీకరించింది. ఈనెల 21న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నరేంద్ర మోదీని ఇంటి పేరుతో విమర్శించడంపై గుజరాత్ BJP MLA పూర్ణేశ్ మోదీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు అప్పీల్ కోసం 30 రోజుల గడువు ఇచ్చింది.
దీనిపై గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడా చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టివేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో శిక్ష విధించడం కరెక్టేనని, దీన్ని నిలిపివేసేందుకు ఎలాంటి కారణాలు లేవంటూ హైకోర్టు పేర్కొంది. జైలు శిక్షపై స్టే ఇవ్వకపోవడంతో రాహుల్ పై అనర్హత వేటు కొనసాగుతున్నది.