మణిపూర్ పరిణామాలపై సుప్రీంకోర్టు సీరియస్ గా దృష్టిసారించింది. వరుసగా చోటుచేసుకున్న ఘటనలు, అల్లర్లపై నిర్లక్ష్యం కనిపడిందంటూ అక్కడి పోలీసుల తీరుపై మండిపడ్డ సుప్రీం.. FIRల నమోదుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై ఆ రాష్ట్ర DGP తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. శుక్రవారం మధ్యాహ్నం DGP కోర్టుకు రావాలని స్పష్టం చేసింది. మణిపూర్ ఘటనలపై FIR దాఖలు చేయడంలో పోలీసుల తీరు సరిగా లేదని పేర్కొంది.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ ఘటనపై సుప్రీంకోర్టు.. నిన్న ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టింది. మే 4న ఘటన జరిగితే 18వ తేదీ దాకా కేసు ఫైల్ కాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఇందులో పోలీసుల ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపించిందని వ్యాఖ్యానించింది. ఇవాళ ఏకంగా పోలీస్ బాస్ నే కోర్టుకు రావాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది.