కేంద్ర మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉందన్న ఊహాగానాల దృష్ట్యా.. లోక్ సభ ఎన్నికల కోసం మోదీ సర్కారు ప్రిపేర్ అవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే సంవత్సరం జరగనున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా రాబోయే సోమవారం( జులై 3న) కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. పార్టీ ప్రెసిడెంట్ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గత కొద్దికాలంగా స్టేట్స్ లీడర్లతో మీట్ అవుతున్నారు. జులై మూడో వారం నుంచి పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అవుతాయి.

మోదీ బుధవారం అర్థరాత్రి పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించడంతో కేబినెట్ లో త్వరలోనే భారీ స్థాయిలో మార్పులు జరుగుతాయన్న ప్రచారం సాగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం కాబోతుండటం విశేషంగా నిలుస్తోంది. ఈ సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగే రాష్ట్రాలకు చెందిన లీడర్లకు మంత్రి పదవులు దక్కే అవకాశముంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు మంత్రి వర్గంలో స్థానం ఉండగా.. వీరితోపాటు కొత్తవారికి అదనంగా అవకాశం ఇస్తారా లేదంటే ఇపుడున్న వారికి తొలగించి అవకాశమిస్తారా అన్న సందిగ్ధం కనపడుతోంది. మొత్తానికి అటు వచ్చే ఏడాది జరిగే లోక్ సభ, ఇటు ఈ ఏడు నిర్వహించే అసెంబ్లీ ఎలక్షన్సే లక్ష్యంగా కేంద్ర మంత్రి మండలి భేటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.