
పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా, ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేలా మాట్లాడారంటూ PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై కేసులు ఫైల్ చేశారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పోలీస్ అసోసియేషన్ల తరఫున ఇద్దరు ASIలు ఇచ్చిన కంప్లయింట్ల మేరకు రెండు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసు శాఖను కించపరిచే విధంగా అధికారుల పేర్లను రెడ్ డైరీలో రాసిపెడుతున్నామని.. వంద రోజుల్లో బట్టలు ఊడదీస్తామంటూ హైదరాబాద్ గాంధీభవన్ లో మాట్లాడినందున ఆయనపై కేసు ఫైల్ చేయాలంటూ కంప్లయింట్స్ అందాయి. దీంతో రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్లతోపాటు నాగర్ కర్నూల్ ఠాణాలో కేసులు ఫైల్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో సెక్షన్లు IPC 153, 504 కింద కేసు ఫైల్ చేశారు. ఇక భూత్పూర్, జడ్చర్ల PSల్లో 153, 504, 505(2), 506 కింద కేసులు నమోదు చేసినట్లు జిల్లా పోలీసు కార్యాలయాలు తెలిపాయి.