ధరణి, కుటుంబ పాలనతో కేవలం కేసీఆర్ కుటుంబమే సంతోషంగా ఉన్న స్టేట్ లో BJP రావడం ఖాయమని, దాంతో ధరణి మాయమని ఆ పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు. BRS అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అంటూ విమర్శలు చేశారు. నాగర్ కర్నూల్ లో జరిగిన BJP నవసంకల్ప సభా వేదికగా.. కేసీఆర్ పాలనపై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు దుఃఖంలో ఉంటే, కేసీఆర్ ఆయన తనయుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. మోదీ సర్కారు పేదలకు అంకితమని, అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికం 10 శాతానికి పడిపోయిందన్నారు. ఐటీ, ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లో భారత్ దూసుకుపోతోందని, మోదీ విజనరీతో ప్రపంచ దేశాల్లో మన దేశానికి అరుదైన గుర్తింపు దక్కుతోందన్నారు.
ధరణి పోర్టల్ కాదు… BRS పోర్టల్…
గ్లోబల్ లీడర్ గా మోదీని ప్రపంచమంతా ఆకాశానికెత్తేస్తోందని, తమ సర్కారు తెచ్చిన రిఫార్మ్స్ తో దేశం రూపురేఖలు మారుతున్నాయన్నారు. రాష్ట్రానికి రూ.4,400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ కారిడార్స్, వందేభారత్ ట్రెయిన్స్, మెగా టెక్స్ టైల్ పార్క్ ఇచ్చామన్నారు. ధరణి పోర్టల్ ను BRS పోర్టల్ గా చెప్పిన నడ్డా… దాన్ని ఆపేస్తామన్నారు.
అవినీతి పార్టీల ఫొటో సెషన్
బిహార్ రాజధాని పట్నాలో జరిగిన మీట్.. అవినీతి, కుల పార్టీల భేటీ అని నడ్డా విమర్శించారు. విపక్ష పార్టీల అగ్రనేతల మీటింగ్ ను… అక్రమాలకు అడ్డాగా మారిన కుటుంబ ఫొటో సెషన్ అంటూ మాట్లాడారు.