భారత్ లో అక్టోబరు-నవంబరులో జరిగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్ కు శ్రీలంక క్వాలిఫై అయింది. క్వాలిఫైయర్ సూపర్ సిక్స్ స్టేజ్ లో జింబాబ్వేపై విన్నర్ గా నిలిచింది. 9 వికెట్ల తేడాతో గెలిచి 8 పాయింట్లు సాధించిన లంక.. వరల్డ్ కప్ ఆడనున్న తొమ్మిదో జట్టుగా అవతరించింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వరల్డ్ కప్ లో శ్రీలంక అడుగుపెట్టగా.. అటు జింబాబ్వే రేసు నుంచి నిష్క్రమించింది.
తొలుత బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 32.2 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌట్ అయింది. 166 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లంక.. ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని దక్కించుకుంది. లంక బ్యాటర్లలో నిసాంక (101) అజేయ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు.