విద్యుత్తు రంగంలో రాష్ట్రానిది దేశంలోనే ఒక విజయగాథ అన్న CM కేసీఆర్.. ఆర్టీసీ బిల్లును అడ్డుకునేందుకు కొన్ని సంకుచిత శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి కొందరు ఆందోళనతో ఉన్నారని, ఆర్టీసీ బిల్లును ఆమోదించడంతో వారి కుటుంబాల్లో ఆనందం నిండిందని గుర్తు చేశారు. గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని CM ఎగురవేసి ప్రసంగించారు. త్వరలోనే కొత్త PRCకి సంబంధించి కమిటీ వేస్తామని, అప్పటివరకు IR అందిస్తామని తానే స్వయంగా ప్రకటించానన్నారు.