భారీ వర్షాలపై CM కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్రాంతాలకు అవసరమైతే హెలికాప్టర్లు(Helicopters) పంపాలని ఆదేశించారు. దీంతో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేశారు. మొరంచపల్లిలో వరద పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడకి వెంటనే హెలికాప్టర్ పంపాలని ఆదేశించారు. మొరంచపల్లి గ్రామంలోకి పెద్దయెత్తున వాన నీరు చేరుకుని.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లన్నీ నీళ్లల్లో మునిగిపోవడంతో గ్రామస్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.
దీనిపై రివ్యూ నిర్వహించిన సీఎం.. బాధితులందర్నీ బయటకు తీసుకువచ్చేందుకు హెలికాప్టర్ పంపాలని స్పష్టం చేశారు. అక్కడ ఒక లారీ నీళ్లల్లో చిక్కుకుని అందులో నుంచి డ్రైవర్ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్న రక్షణ సిబ్బంది.. డ్రైవర్ ను లారీ లోనుంచి మైదాన ప్రాంతానికి తీసుకువచ్చారు.