ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ కు ముందడుగు పడుతోంది. లక్షల మంది అభ్యర్థుల ఎదురుచూపులకు ఇక తెరపడబోతోంది. రాష్ట్రంలో రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారి TSPSCకి బదులు జిల్లాల కలెక్టర్లే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ రెండు రోజుల్లో తెలియజేస్తామన్నారు. ఈసారి మొత్తం 6,500 పోస్టులు భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్య శాఖలో 5089 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లల్లో 1,523 పోస్టులు భర్తీ కానున్నాయి. జిల్లాల్లోని కలెక్టర్లే ఈ నోటిఫికేషన్ ను రెండు రోజుల్లో రిలీజ్ చేస్తారని మంత్రి తెలిపారు. DSC విధివిధానాల(Guidelines)పై అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. జిల్లా లెవెల్లో జరిగే రిక్రూట్ మెంట్ ప్రక్రియకు ఛైర్మన్ గా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వైస్ ఛైర్మన్ గా, DEO సెక్రటరీగా, ZP CEO మెంబర్ గా ఉంటారు.
ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీపై ఫైల్ ను.. కొద్దిరోజుల క్రితం ఆర్థిక శాఖకు పంపడంతో ఆశలు చిగురించాయి. మొత్తం 5,200కు పైగా పోస్టులకు గాను.. 2,600 SGT, 1,700 స్కూల్ అసిస్టెంట్లు, 600 లాంగ్వేజ్ పండిట్స్, 160 PET ఖాళీలున్నాయని, వాటి డీటెయిల్స్ తో కూడిన ఫైల్ ను.. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ చేర్చింది. అయితే వీటికి మరిన్ని పోస్టులను జోడీస్తూ అన్నింటినీ నింపాలని డిసిషన్ తీసుకున్న సర్కారు.. మొత్తంగా ఆరున్నర వేల పోస్టులు భర్తీ(Fill up) చేయనున్నట్లు ప్రకటించింది. టెట్ ఎగ్జామ్ సెప్టెంబరు 15న జరగనుండగా.. దీనికి పెద్దసంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో చివరగా 2022 జూన్ 12న టెట్ ఎగ్జామ్ జరిగింది. దీని కాల పరిమితి జీవిత కాలం కాగా.. పేపర్-1కు బీఈడీ, డీఈడీ.. పేపర్-2కు బీఈడీ అభ్యర్థులు అర్హులు. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2016 మే, 2017 జులై, 2022 జూన్ లో టెట్ నిర్వహించారు. రాష్ట్రంలో సుమారు 13 వేల పోస్టులు రిక్రూట్ చేయనున్నట్లు గతేడాది ప్రభుత్వం ప్రకటించింది.