KCR మనవడు, KTR తనయుడు హిమాన్షు తన ఉదారతను చాటుకునేలా స్కూల్ కోసం రూ.కోటి అందజేశారు. ఓ గవర్నమెంట్ స్కూల్ ను అడాప్ట్ చేసుకుని కార్పొరేట్ తరహాలో తయారు చేశారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా ఈ బడి ప్రారంభం కానుంది.
గచ్చిబౌలి కేశవనగర్ లోని ప్రైమరీ స్కూల్ కు వెళ్లి అక్కడి స్టూడెంట్స్ తో హిమాన్షు తరచూ మాట్లాడుతుండేవారు. ఖాజాగూడలోని ప్రైవేటు కాలేజీలో చదివిన సమయంలో ఆ స్కూల్ ను పరిశీలించేవారు. పేద విద్యార్థులు చదువుకునే బడిని డెవలప్ చేసేందుకు గాను రూ.కోటి అందజేశారు. గతంలో తను చదివిన బడిలో సేకరించిన నిధులను వెచ్చించి ఈ పనులు పూర్తి చేశారు.