
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) వార్డుల పెంపు, పునర్విభజనపై అభ్యంతరాలు వస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. జనాభా తీరు, సరిహద్దుల్ని లెక్కలోకి తీసుకోకపోవడం వల్ల అన్యాయం జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. దీన్ని స్వీకరించిన జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి.. రేపు విచారణ చేపట్టనున్నారు. 150 డివిజన్లను 300కు పెంచారు. ఇప్పటివరకు 2 వేల వరకు అభ్యంతరాలు వచ్చాయి. అయితే వినయ్ కుమార్ పిటిషన్ సరిగా లేదని కోర్టు అభిప్రాయపడింది.