ఎన్నికల తీర్పుల్ని హైకోర్టు వేగవంతం చేస్తుండగా.. ఇప్పటికే పలువురు MLAల గుండెల్లో గుబులు కనిపిస్తున్నది. కానీ తాజాగా వెలువడిన భిన్నమైన తీర్పు మాత్రం ఆ MLAకు రిలీఫ్ ఇచ్చింది. ఇప్పటికే ఒక MLAపై హైకోర్టు వేటు వేయగా.. ఇప్పుడు నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు మర్రి జనార్దన్ రెడ్డి మాత్రం ఊరట లభించింది. గత ఎలక్షన్లలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రత్యర్థి అయిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.
2019లో నాగం జనార్దన్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు కోర్టు తీర్పు వెల్లడించింది. అఫిడవిట్ లో కొన్ని వివరాలు దాచిపెట్టారన్న ఆరోపణలపై సరైన ఆధారాలు(Proofs) చూపలేదని కోర్టు నిర్ణయానికి వచ్చింది.