
ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతు రుణమాఫీ స్కీమ్ ను ఆగస్టు 3(రేపటి నుంచి) మొదలు పెట్టాలని ఆదేశించారు. ఆర్థికశాఖతో ప్రగతి భవన్ లో మీటింగ్ నిర్వహించిన CM.. రుణ మాఫీని వర్తింపజేయాలని సూచించారు. రూ.లక్ష లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని 2018 ఎలక్షన్ల ప్రచారంలో KCR ప్రకటించారు. ఇప్పటికే కొంతవరకు రుణాలు మాఫీ చేశామని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని గుర్తు చేశారు.
విడతల వారీగా రైతుబంధు తరహాలో మాఫీ ఉండాలన్న సీఎం.. సెప్టెంబర్ రెండో వారంలోగా ఈ ప్రోగ్రాంను కంప్లీట్ చేయాలన్నారు. ఇంకో రూ.19,000 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందన్నారు.