బౌలర్లు గెలిపించినా…
వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలిచి ఊపు మీదున్న CSKకు ఓటమి రుచి చూపించిన పంత్.. మ్యాచ్ ను నడిపించడంలో నిదానత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో IPL కోడ్ ఆఫ్ కండక్ట్ మేరకు అతడికి ఫైన్ పడింది. ఈ మ్యాచ్ లో రిషభ్ 32 బంతుల్లోనే 51 పరుగులు చేయగా, చెన్నై ముందు 192 రన్స్ టార్గెట్ ఉంచింది.
CSK 20 పరుగుల తేడాతో ఓడిపోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ముకేశ్, ఖలీల్ ప్రధాన పాత్ర పోషించారు. అయితే మ్యాచ్ ను అనుకున్న టైమ్ లో గా నడిపించడంలో పంత్ ఫెయిల్ అయ్యాడని భావించిన IPL యాజమాన్యం… ఈ లెఫ్ట్ హ్యాండర్ కు భారీ జరిమానాను ఖాయం చేసింది.