
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా ఉంది. మొదటి ఆపిల్ ఫోన్ వచ్చిన తర్వాత ఐఫోన్ లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు ఇదేనని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు, 23 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపింది. 256జీబీ(రూ.2,99,000), 512జీబీ(రూ.3,24,000), 1టీబీ(రూ.3,74,000), 2టీబీ(రూ.4,49,000)గా ధరలు ఉన్నాయి.
ఆ ఫోన్ ధర.. అక్షరాల రూ.3 లక్షలు
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ ఫోన్ ధర భారీగా ఉంది. మొదటి ఆపిల్ ఫోన్ వచ్చిన తర్వాత ఐఫోన్ లో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పు ఇదేనని కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో అక్టోబర్ 16 నుంచి ప్రీ-ఆర్డర్లు, 23 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపింది. 256జీబీ(రూ.2,99,000), 512జీబీ(రూ.3,24,000), 1టీబీ(రూ.3,74,000), 2టీబీ(రూ.4,49,000)గా ధరలు ఉన్నాయి. సెప్టెంబరు 1న సీఈవోగా జాన్ టెర్నస్ బాధ్యతలు చేపట్టాక ఇదే అతడికి తొలి ప్రొడక్ట్ అవుతుంది. ఐఫోన్ ప్రో బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బర్గండీ కలర్ లో దొరుకుతుండగా, 6.3 అంగుళాల డిస్ ప్లే, 34 గంటల వీడియో ప్లేబ్యాక్ వంటి స్పెషల్ ఫీచర్లున్నాయి. ఐఫోన్ ప్రోమాక్స్ 6.9 అంగుళాల డిస్ ప్లేతో ఉండగా, 43 గంటల పాటు వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్ ఉంది. ఈ రెండూ 256జీబీ, 512జీబీ, 1టీబీ, 2టీబీల్లో దొరుకుతాయి.
ఐఫోన్ 18ప్రో ధరలు
*256జీబీ – రూ.1,64,000
*512జీబీ – రూ.1,89,000
*1టీబీ – రూ.2,39,000
*2టీబీ – రూ.3,14,000
ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ ధరలు
*256జీబీ – రూ.1,79,000
*512జీబీ – రూ.2,04,000
*1టీబీ – రూ.2,54,000
*2టీబీ – రూ.3,29,000