
బంగారం ధరలు మరోసారి భారీగా దిగివచ్చాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర ఏకంగా రూ.2,070 పడిపోయి రూ.1,52,020కి… 22 క్యారెట్ ధర రూ.1,900 క్షీణించి రూ.1,39,350 చేరుకుంది. వెండి కిలో రూ.2,50,000గా ఉంది. ఈరోజు వెండి ధరల్లో ఇంకా మార్పు కనిపించలేదు. గత పది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా రేట్ల డౌన్ ట్రెండ్ కొనసాగుతుండగా, ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో బంగారం కొనాలా, వద్దా అన్న అనుమానంతోనే ఉన్నారు. అసలేం జరుగుతుందో మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ధరల ఆకస్మిక తగ్గుదలతో ఇప్పటికిప్పుడు పసిడి కొనాలనుకున్నవాళ్లు సైతం వెనుకడుగేస్తున్నారు.