
దేశంలోని పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM), గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాలకు పదోతరగతి పాసై మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష తెలిసి ఉండాలి. 18-40 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుండగా, పోస్టును బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ.29,380 అందుతుంది. ఆసక్తి గలవారు indiapostgdsonline.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.