
మధ్యప్రదేశ్ 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి నేహా మార్వ్యా ఏడాదిలోనే నాలుగోసారి బదిలీ అయ్యారు. గిరిజనాభివృద్ధి డైరెక్టర్ గా వచ్చి 50 రోజులే కాగా, వివరణ కోరుతూ ఉద్యోగులకు నోటీసులివ్వడమే పాపమైంది. వారంతా పెన్ డౌన్ చేయడంతో బదిలీ తప్పకపోగా.. రెండు, మూడు నెలలకోసారి పోస్టులు మారుతూనే ఉన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను అర్థం చేసుకునేలోపే తొలగిస్తున్నారంటూ ఐఏఎస్ అసోసియేషన్ కు ఆమె లేఖ రాశారు.