
భారత క్రికెటర్ షెఫాలి వర్మ ఔటైనప్పుడు పెవిలియన్ కు దారి చూపిస్తూ కించపరిచిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు షాక్ తగిలింది. రిఫరీ ఆమెకు మ్యాచ్ ఫీజులో 10% జరిమానాతోపాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. 24 నెలల వ్యవధిలో ఫాతిమాకు ఇది రెండో తప్పిదమైతే డీమెరిట్ పాయింట్ల సంఖ్య 2కు చేరింది. 2025 ఆగస్టులో ఐర్లాండ్ తో టీ20లోనూ అతిగా ప్రవర్తించింది. పాక్ తొలుత 55కే ఆలౌటైనా, ఆమె ఓవరాక్షన్ చేసింది.
మహిళల ఆసియా టీ20 టోర్నీలో భారత్ తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 56 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని దక్కించుకుంది. దీంతో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ గెలిచి తిరుగులేని రీతిలో సెమీ ఫైనల్ బెర్తుకు ఢోకా లేకుండా చేసుకుంది.