
వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ కు పనిచెప్పాడు. సెంట్రల్ జోన్ పై రెండో ఇన్నింగ్స్ లో వరుసగా 4, 6, 4, 4 బాది ఊపు మీదున్న అతడు 40 పరుగులు చేసి పటీదార్ పట్టిన అద్భుతమైన క్యాచ్ తో ఔటయ్యాడు. తొలి 30 బంతుల్లో 16 పరుగులే చేసిన అతడు మరో 11 బంతుల్లోనే 24 రన్స్ రాబట్టాడు. టెస్టు మ్యాచ్ మాదిరిగా నిదానంగా ఆడుతూనే అవకాశం వచ్చినపుడు వన్డే, టీ20 తరహాలో ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోయాడు. మొత్తంగా 3 ఫోర్లు, సిక్సులు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో రెండు జట్లు 266 పరుగులకే ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో సెంట్రల్ జోన్ 158కి ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ ప్రస్తుతం 72/2తో ఉండి మరో 87 పరుగులు చేయాలి. తొలి ఇన్నింగ్స్ లో 81 బంతుల్లో 92 చేశాడు సూర్యవంశీ.