
భర్త మరణించిన తేదీ నుంచే వితంతు(Widow) పింఛను ఇవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పిటిషనర్, ఆమె భర్త విడిగా నివసించేవారు. భర్త మరణించే సమయానికి 2001లో సర్వీస్ వివరాలు ఆమెకు తెలియవు. అయితే మరణ తేదీల్లో జాప్యం, వ్యత్యాసాలున్నాయంటూ 2012లో భార్య వినతిని అధికారులు తిరస్కరించారు. దీంతో బాధితురాలు బాంబే హైకోర్టును ఆశ్రయిస్తే 2014 నుంచి పింఛను ఇవ్వాలని ఆదేశించింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఆమెకు అనుకూలంగా జస్టిస్ పి.కె.మిశ్రా, జస్టిస్ శ్రీచంద్రశేఖర్ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.