
పారిస్ లో ఒక ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చిన బోచసన్యాని అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థకు చెందిన 100 మంది ఈఫిల్ టవర్ చూద్దామని వెళ్లారు. వీరికి స్వాగతం పలకకుండా ఉండేందుకు అక్కడున్న హిందూ మహిళా ఉద్యోగుల్ని ముందుగానే వెళ్లిపొమ్మన్నారు. ఈఫిల్ టవర్ ను అసాధారణ పరిస్థితుల కారణంగానే మూసివేసినట్లు దాన్ని నిర్వహిస్తున్న ఎస్ఈటీఈ సంస్థ తెలిపింది. అయితే ఈ ఆకస్మిక నిర్ణయంతో తాము దిగ్భ్రాంతికి గురయ్యాయని ఆ ఉద్యోగులు చెప్పడంతో వివాదం ఏర్పడింది. ఈ విషయాన్ని అక్కడి యూరో న్యూస్ రాసింది. ఇప్పటివరకు ఈఫిల్ టవర్ లోకి రానివ్వని సందర్భం ఎప్పుడూ తలెత్తలేదు. పరస్పర గౌరవం, సార్వత్రిక విలువలే లక్ష్యంగా అందులోకి అందర్నీ అనుమతిస్తుంటారు. జరిగిన ఘటనపై ఫ్రాన్స్ ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.