
కిర్గిస్థాన్ లోని బిష్కెక్ లో జరుగుతున్న షాంఘై సహకార సదస్సు(SCO)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్, రష్యా, చైనా అధినేతలు మోదీ, పుతిన్, జిన్ పింగ్ చేతిలో చేయి వేసుకుంటూ మాట్లాడారు. ఈ ముగ్గురూ మరోసారి కలుసుకోవడం ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టేలా గతంలోనూ ఈ ముగ్గురూ కలుసుకోవడంతో అగ్రరాజ్యం తట్టుకోలేకపోయింది. భారత్-చైనా మధ్య కవ్వింపులుంటున్నా రష్యా పెద్దన్నగా వ్యవహరిస్తూ బ్యాలెన్స్ చేస్తోంది.
డిజిటల్ & ఏఐ సహకారం, కౌంటర్ టెర్రరిజం, ప్రాంతీయ భద్రతకు కలిసి ముందుకు సాగాలని ముగ్గురు అధినేతలు నిర్ణయించారు. ఉక్రెయిన్ తో సుదీర్ఘకాలంగా రష్యా యుద్ధం కొనసాగిస్తుండటం, అమెరికా-ఇరాన్ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని టెహ్రాన్ నాయకత్వం కోరడం, ఇదే సదస్సులో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మోదీతో భేటీ కావడంతో ఈ మూడు అగ్రదేశాల నేతల సమావేశంపైనే అందరి చూపూ ఉంది.