
లారీ కంటైనర్(Container) అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటన కరీంనగర్(Karimnagar)లో జరిగింది. రాజీవ్ రహదారిపై అల్గునూర్ లోని కార్పొరేట్ స్కూల్ సమీపంలోని ఇంట్లోకి కంటైనర్ దూసుకుపోయి రేకుల షెడ్డు మొత్తం కూలిపోయింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వాళ్లంతా భయపడి బయటకు వచ్చారు. రేకుల షెడ్డును ధ్వంసం చేసి లారీ ఇంట్లోకి వెళ్లిపోయింది. రూ.8 లక్షల ఆస్తి నష్టం జరగ్గా, ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.