
ఇందిరమ్మ ఇళ్ల డ్రా తీరుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నియోజకవర్గానికి 500 ఇళ్లు ఇస్తామని సీఎం ప్రకటిస్తే, సెగ్మెంట్లో లేని వ్యక్తులకే కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఖైరతాబాద్ నివాసులకు కేవలం 120 ఇళ్లే దక్కాయని, స్థానిక ఎమ్మెల్యే ముందే డ్రా తీయాల్సి ఉండగా తాను రాకముందే తీశారని ఆరోపించారు. హౌజింగ్ బోర్డ్ ఎండీ గౌతమ్ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని విమర్శించారు.
“360 డిగ్రీల్లో స్క్రూటినీ జరిపి లక్కీ డ్రా తీయాలి.. అలా కాకుండా ర్యాండమ్ గా తీసుకొని డబ్బాలో చీటీలు వేసి తీయడమేంటి.. ఎండీ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నా.. స్పీకర్ తోపాటు 10 మంది ఎమ్మెల్యేలం ఆయన్ను పిలిచాం.. పూర్తి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతోపాటు ఆయన బాడీ లాంగ్వేజ్ చూసి ఆశ్చర్యపోయాం.. ఇప్పుడే ఇలా ఉంటే ఇక సీనియర్ అయిన తర్వాత ఎలా ఉంటారు.. నేను స్పీకర్ స్థానంలో ఉంటే ఆరోజే ఆయన్ను సస్పెండ్ చేసేవాణ్ని..” అని అన్నారు.