
రాష్ట్రవ్యాప్తంగా ‘నీట్(NEET)’ పీజీ పరీక్ష జరుగుతుండగా, ఓ ఎగ్జామ్ సెంటర్ లో ఆశ్చర్యకర ఘటన ఎదురైంది. పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థి తాగి ఉన్నాడు. మద్యం తాగి వచ్చినట్లు గుర్తించిన రంగారెడ్డి జిల్లా శేరిగూడ పరీక్ష కేంద్రం నిర్వాహకులు అతణ్ని అక్కణ్నుంచి వెనక్కు పంపించారు. రాష్ట్రంలోని 56 సెంటర్లలో 17,627 మంది పరీక్షలు రాస్తున్నారు.