
నేపాల్ వరదల్లో వందలాది మంది సొరంగాల్లో(Tunnels)నే చిక్కుకుపోయారు. వారంతా బతికున్నారా, లేదా అన్నది తెలియాల్సి ఉంది. రసువా, నువాకోట్ జిల్లాల్లోని 11 జల విద్యుత్ ప్రాజెక్టుల వద్ద 573 మంది సొరంగాల్లోనే ఉన్నారు. 934 మంది గల్లంతైనట్లు ప్రకటించాక 361 మందిని రక్షించారు. నిర్మాణ దశలోని ప్రాజెక్టుల్లో చిక్కుకున్నవారి సంఖ్య భారీగానే ఉండగా.. అందులో భారత్, నేపాల్, ద.కొరియా, చైనా, జర్మనీ పౌరులున్నారు.
భారీ సంఖ్యలో పోలీసులు, సైనికులు సహాయక చర్యలు చేపడుతున్నారు. విదేశాల సాయం అక్కర్లేదని ఇప్పటికే అక్కడి సర్కారు ప్రకటించడంతో కేవలం నేపాలీలే రక్షణ చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్న 97 ఏళ్ల వృద్ధురాలు, ఆరేళ్ల బాలిక 72 గంటల నరకం తర్వాత బురద నుంచి బయటపడ్డారు.