
హైదరాబాద్ లో ఎన్ఎండీసీ నిర్వహించిన 15వ ఎడిషన్ హాఫ్ మారథాన్ కు భారీ స్పందన లభించింది. 21.1 కి.మీ. దూరానికి గాను నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు సాగిన మారథాన్ లో వేలాదిగా రన్నర్స్ పాల్గొన్నారు. కెన్యా నుంచి వచ్చిన 8 మంది రన్నర్స్ పాల్గొనడం విశేషం కాగా, మొత్తంగా 8 వేల మందికి పైగా హాజరయ్యారు. పీపుల్స్ ప్లాజా నుంచి మొదలై కేబుల్ బ్రిడ్జి, మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలికి చేరుకుంది. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.