
2025 సంవత్సరానికి గాను అర్జున అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా కమిటీ సిఫార్సులతో పురస్కారాల్ని ప్రకటించింది. రూ.25 లక్షల నగదు బహుమతి గల మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఈసారి ఎవరికీ ఇవ్వలేదు. అవార్డు పొందిన 17 మంది విజేతలు వీరే… తేజస్విని శంకర్, మహ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి(అథ్లెటిక్స్), ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్(బ్యాడ్మింటన్), నరేంద్ర(బాక్సర్), విదిత్ సంతోశ్ గుజరాతీ, దివ్య జితేంద్ర దేశ్ ముఖ్(చెస్), ధనుష్ శ్రీకాంత్(షూటర్), లాల్ రెమ్సియామి, రాజ్ కుమార్ పాల్(హాకీ), సుర్జీత్, పూజ(కబడ్డీ), రుద్రాంశ్ ఖండేల్వాల్(పారా షూటర్), ఏక్తా భయాన్(పారా అథ్లెట్), అరవింద్ సింగ్(రోవర్), అఖిల్ షెరాన్(షూటర్).