
భారతదేశం ధర్మశాల కాదని, ఇక్కడ నివసించే హక్కు దేశ పౌరులకు మాత్రమే ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. “2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కావాలంటే జాతీయ భద్రత కీలకం.. గత ప్రభుత్వాలు డ్రగ్స్, నక్సలిజం, ఈశాన్యంలో అశాంతి రూపుమాపి ఉంటే దేశం ఇలా ఉండేదే కాదు.. అక్రమ చొరబాటుదారులు జాతీయ భద్రతకు, ఆర్థిక స్థిరత్వానికి, జనాభా సమతుల్యతకు ముప్పు కలిగిస్తారు.. రాబోయే 15-20 ఏళ్లలో మనం పూర్తిగా మార్చాల్సి ఉంది.. ఇందుకు రాష్ట్ర, కేంద్ర సంస్థలు, సాయుధ బలగాలే కీలకం.. గత 8 నెలలుగా అన్ని భూ సరిహద్దు రాష్ట్రాలను కేంద్రం సంప్రదించి సమగ్ర సరిహద్దు చట్టాన్ని అమలు చేస్తోంది.. తక్కువ సమయంలోనే భారతదేశాన్ని అక్రమ చొరబాట్ల నుంచి విముక్తం చేస్తాం..” అని ఇంటెలిజెన్స్ బ్యూరో సదస్సులో గుర్తు చేశారు.