
స్వాతంత్ర్య దినోత్సవం నాడు అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. లష్కరే తొయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ అబిద్ రంజాన్ షేక్ ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. కొడుకు టెర్రరిస్టైనా తాము మాత్రం భరతమాత సేవలోనే ఉంటామంటూ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని అతడి తల్లిదండ్రులు తమ ఇంట్లో జాతీయ పతాకం ఎగురవేశారు.
హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ తండ్రి, ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ అయిన ముజఫర్ 2021లో జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అతడి తర్వాత కశ్మీర్లో జరిగిన రెండో సంఘటన ఇది. యువకుల్ని ఉగ్రవాదంలోకి మళ్లించే బుర్హాన్ తోపాటు మరో ఇద్దరిని భద్రత బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. ఎప్పుడూ కల్లోలంగా ఉండే జమ్ముకశ్లీర్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా జరిగాయి.