
నీట్ పరీక్షల లీకేజీపై కేంద్ర మంత్రిని రాజీనామా చేయించిన విద్యార్థులు.. మరోసారి సత్తా చూపించారు. లాఠీఛార్జిలు, బాష్పవాయుగోళాలకు వెరవకపోవడంతో ఝార్ఖండ్ లో రెండు పరీక్షల్ని అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీతోపాటు, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్ జరిగిందంటూ 24 రోజులుగా విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళన చేయడంతో ఆ 2 పరీక్షల్ని సోరెన్ సర్కారు రద్దు చేసింది. విద్యార్థుల ప్రయోజనాల కోసం కఠిన చట్టం తెస్తామని చెప్పడంతో పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ ఐఏఎస్ అమితాబ్ కౌశల్ నేత్వతంలో కమిటీ పనిచేస్తుందని మంత్రివర్గం ప్రకటించింది.