
భారత గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. గ్రాండ్ ప్రి చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచి, రూ.2 కోట్ల ప్రైజ్ మనీ అందుకున్నాడు. సెయింట్ లూసియాలో జరిగిన టోర్నీ ఫైనల్లో ఫాబియానో కరువానాపై విజయంతో కెరీర్లోనే అతిపెద్ద టైటిల్ సాధించాడు. ఫైనల్ కు ముందు 6 పాయింట్ల లోటుతో ఉన్నా, రెండు ర్యాపిడ్ గేములు గెలిచాడు. తర్వాత బ్లిట్జ్ విభాగంలో సంయమనం కోల్పోకుండా 15-13తో గెలిచాడు. తొలుత టఫ్ గా ఉన్న బ్లిట్జ్ ను అనుకూలంగా మార్చుకున్నాడు.