
ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ వి.ప్రసన్న వెంకటేశ్(2012 బ్యాచ్)కు కేంద్రం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. నీట్ పరీక్షల లీకేజీతో అభాసుపాలైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే)కి కొత్త డైరెక్టర్ గా నియమించింది. ఐదేళ్ల పదవీకాలానికి గాను వెంటనే ఆయన్ను రిలీవ్ చేయాలంటూ ఏపీ సీఎస్ కు కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీవోపీటీ) లేఖ రాసింది. మరో 10 రోజుల్లోపే ఆయన బాధ్యతలు చేపట్టాల్సి ఉంది.