
దేశంలో అర్హతకు తగిన ఉద్యోగాలను సృష్టించడం కంటే పట్టభద్రుల్ని తయారు చేయడంలోనే స్పీడ్ పెరిగిందని పలు సర్వేలు చెబుతున్నాయి. 70% యువత తొలి ఉద్యోగం కోసం మూడు నుంచి ఐదేళ్లుగా వేచిచూస్తూనే ఉంది. ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలకు ఎక్స్ పీరియన్స్ తప్పనిసరని 72% మంది చెబితే, 20% మంది మాత్రమే కాలేజీల్లో ఇంటర్న్ షిప్ దొరికిందంటున్నారు. 2021 నుంచి ఫ్రెషర్ల నియామకాలు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగానికి తగ్గ చదువు, డిగ్రీకి తగ్గ ఉద్యోగాల్లేవని తెలిపాయి.
నిరుద్యోగిత శాతం నిరక్షరాస్యుల్లో 0.3, ప్రాథమిక స్థాయిలో 0.6, మాధ్యమిక విద్యలో 1.6, ఉన్నత విద్యలో 3.1 నుంచి 6.5గా ఉంది. ఐదు ఉద్యోగాల కోసం 10 మందికి శిక్షణనిస్తే ఒక్కరూ క్వాలిఫై కాని దురవస్థ ఉంది. విద్యారంగంలో పరిశ్రమలు ప్రవేశిస్తే గానీ ఫలితం ఉండదంటున్నారు నిపుణులు. విద్యా సంస్కరణలే కాదు.. తయారీ, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, లాజిస్టిక్స్ రంగాలు బలోపేతం కావాలంటున్నారు.