
వ్యాపార ప్రయోజనాలే బాబా రాందేవ్ ను సనాతన తత్వ సిద్ధాంతాల నుంచి దూరం చేశాయని నటి, ఎంపీ కంగన రనౌత్ విమర్శించారు. “అతని స్వదేశీ ఉద్యమం మొదలైనప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించింది.. కానీ పెట్టుబడిదారీ విధానంలోకి రాందేవ్ వెళ్లిపోయారు.. ప్రజల నుంచి ఎంత రాబట్టాలనే విషయంలో సనాతనం, పెట్టుబడిదారీ విధానం మధ్య సంఘర్షణ తలెత్తవచ్చు..” అన్నారు.
మీ ఇద్దరి మధ్య అగాధం ఎందుకు పెరిగిందన్న ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. “ఆయుర్వేదం, మూలికలు, యోగాను మించి రాందేవ్ బాబా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.. అవి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇప్పుడు బనియన్లు, లోదుస్తులు అమ్మే వ్యాపారాల వైపు మళ్లారు..” అని తీవ్రంగా మండిపడ్డారు.