
బంగారం ధరలు గత ఐదు రోజుల నుంచి డౌన్ ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ 10 గ్రాముల ధర ఈరోజు రూ.2,890 తగ్గి రూ.1,58,240కి… 22 క్యారెట్ ధర రూ.2,650 దిగొచ్చి రూ.1,45,050కి చేరుకుంది. వెండి కిలో రూ.2,65,000గా ఉంది. ఐదు రోజులుగా ట్రెండ్ చూస్తే… ఈనెల 25న మేలిమి పసిడి స్వల్పంగా రూ.220 తగ్గితే, 26న ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కానీ 27వ తేదీన ఏకంగా భారీస్థాయిలో రూ.3,110 మేర క్షీణించింది. ఇక నిన్న సాయంత్రం మాత్రమే స్వల్పంగా రూ.490 పెరిగితే, ఈరోజు మళ్లీ తిరోగమనం బాట పట్టింది. ఇలా నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.6,000 క్షీణించడం మార్కెట్ల తీరును తెలియజేసింది.