
నేపాల్ కు మరో ముప్పు ముంచుకొస్తున్నట్లే ఉంది. ఇంకొద్దిసేపట్లో భారీ ఉపద్రవం తప్పదని పోలీసులు హెచ్చరించడంతో అక్కడి జనం పరుగులు పెడుతున్నారు. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతోనే కాలం గడుపుతున్నారు. మొన్నటి వరదల్లో 500 మంది చనిపోగా, 1,500 మంది జాడ లేకుండా పోయింది. ఇప్పుడు అంతకు ఐదు రెట్ల విపత్తు తప్పదని హెచ్చరించడంతో నేపాల్ అంతా గందరగోళంగా తయారైంది.
ముందుగా హెచ్చరించినట్లుగానే చైనాలో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్ ప్రావిన్సులో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. చైనా-టిబెట్-నేపాల్ ప్రాంతంలో భారీ వరదలు పోటెత్తే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇవ్వడంతో టిబెట్ లో సహాయక చర్యలు నిలిపివేశారు. అటు టిబెట్ లో బ్యారేజ్ తెగిపోయిందని నేపాల్ పోలీసులు ప్రకటించడంతో భయానక వాతావరణం ఏర్పడింది.