
విదేశాల్లోని భారతీయులపై దాడులు గత ఐదేళ్లలో ఏడు రెట్లు పెరిగాయి. 2021లో 15 జరిగితే 2025లో అది 104కు చేరుకుందని విదేశాంగ మంత్రిత్వశాఖ రాజ్యసభలో డేటా విడుదల చేసింది. అత్యధికంగా అమెరికా, యూఏఈ, యూకేల్లో ఉన్నాయి. గత ఐదేళ్లలో అమెరికాలో 32, యూఏఈలో 32, యూకేలో 31, కెనడాలో 30, ఐర్లాండ్ లో 24, రష్యాలో 23, జర్మనీలో 19 దాడులు జరిగాయి. 2021లో 15, 2022లో 31, 2023లో 67, 2024లో 85 నమోదయ్యాయి.
గతేడాది అనేక జాత్యహంకార దాడుల కేసులు నమోదైన ఐర్లాండ్ లో ఈమధ్య కాలంలో హింస విపరీతంగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లోని భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ స్పందించారు. అలాంటి అవాంఛనీయ ఘటనలపై భారత మిషన్లు, రాయబార కార్యాలయాలు అప్రమత్తంగా ఉన్నాయన్నారు.