
మొన్న కొలంబియాను భారీ భూకంపం వణికిస్తే ఇప్పుడు మరోసారి అలాంటి విపత్తే ఇండొనేషియాను బెంబేలెత్తించగా, ఇద్దరు చనిపోయారు. మౌంట్ అబూ అగ్నిపర్వతం పేలి ఐదు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగిసిపడింది. దాని పరిసర ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేస్తుండగానే, వరుసగా భూకంపాలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై అత్యధిక తీవ్రత 7.7గా నమోదవగా, ఫ్లోరెస్ ద్వీపానికి 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గంటన్నర వ్యవధిలో 5.. 5.1.. 6.1, 5.6.. 5.9 తీవ్రతతో మరో ఐదు భూకంపాలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మరోవైపు సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి.