
తమిళనాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నటి త్రిష స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అధికారులను, ప్రముఖుల్ని పలకరిస్తూ సందడి చేయగా, ఆమెకు విజయ్ తల్లిదండ్రుల పక్కనే వీఐపీ ఛైర్ వేశారు. విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ దంపతులతోపాటు పలువురు అతిథులతో ముందు వరుసలో కూర్చుని అందరితో నవ్వుతూ, ముచ్చటిస్తూ కనిపించడం తమిళనాడులో హాట్ టాపిక్ గా మారింది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మెరిసిన త్రిష.. ఇప్పుడు మరోసారి అలాంటి ఎంట్రీయే ఇచ్చారు.
విడాకులు కోరుతూ ఎన్నికలకు ముందు విజయ్ భార్య సంగీత కోర్టులో కేసు వేయడం, త్రిషతో ఆయనకు ముడిపెడుతూ ప్రతిపక్షాలు ప్రచారంలో ప్రధానాస్త్రంగా చేసుకోవడం, విజయ్ గెలిచాక విడాకుల కేసును ఆయన భార్య విత్ డ్రా చేసుకోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష మరోసారి అధికారిక కార్యక్రమంలో కనిపించడం చర్చనీయాంశమైంది.